Photomath App : గూగుల్ ప్లే స్టోర్ లో ఫోటో మ్యాథ్స్ యాప్ లాంచ్.. మ్యాథ్స్ సమస్యల పరిష్కరానికి చెక్..!
TeluguStop.com
విద్యార్థులు కష్టమైన గణిత సమస్యలను( Maths Problems ) పరిష్కరించడానికి ఏ రీతిలో కష్టపడతారో అందరికీ తెలిసిందే.
కొన్ని లెక్కలకు సమాధానాలు దొరకగా విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారా.అయితే గూగుల్ విద్యార్థుల గణిత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించడం కోసం ఫొటో మ్యాథ్స్ యాప్( Photomath App ) ను లాంచ్ చేసింది.
ఇకపై ఏదైనా గణిత ప్రశ్నను ఒక ఫోటో తీస్తే చాలు క్షణాల్లో సమాధానం వస్తుంది.
గణితంలో కష్టమైన త్రికోణమితి లేదంటే బీజగణిత సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఈ యాప్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు.
ఫొటో మ్యాథ్స్ యాప్ ఒక స్మార్ట్ కెమెరా క్యాలిక్యులేటర్, మ్యాథ్స్ అసిస్టెంట్ యాప్.
గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.వినియోగదారులు మ్యాథ్స్ సమస్య యొక్క ఫోటో తీస్తే చాలు.
ఆ సమస్య పరిష్కారాన్ని దశలవారీగా వివరణ రూపంలో అందిస్తుంది.ఈ కొత్త యాప్ ఇంటిగ్రేషన్ తో, గూగుల్ తన ఎడ్యుకేషనల్ పోర్ట్ ఫోలియో ను విస్తరిస్తోంది.
"""/"/
ఈ యాప్ ద్వారా సులభంగా గణితం నేర్చుకోవడం, గణితానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
మరి ఈ యాప్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store )లో, IOS పరికరాలలో App Store లో ఈ ఫొటో మ్యాథ్స్ యాప్ కోరకు సెర్చ్ చేసి, యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ తెరచి, అందులో ఉన్న కెమెరా సహాయంతో గణితం ప్రశ్నను కెమెరా తీయాలి.
లేదంటే మాన్యువల్ గా టైప్ చేయాలి.టైప్ చేయడానికి అంతర్నిర్మిత గణిత కీబోర్డ్( Maths Keyboard ) ను ఉపయోగించుకోవచ్చు.
ఇక క్షణాల్లో గణిత సమస్యను స్కాన్ చేసి సరైన పరిష్కారాన్ని అందిస్తుంది. """/"/
ఈ యాప్ బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, గణంకాలు, కాలిక్యులస్(Calculus ) లతో పాటు వివిధ గణిత సమస్యలను పరిష్కరించగలదు.
వినియోగదారుల అవసరాల కోసం బహుళ భాషలను కూడా అందిస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను… నటుడు షాకింగ్ కామెంట్స్!