నాగచైతన్య, సమంత( Naga Chaitanya Samantha ) విడిపోయి ఏడాది దాటి పోయినా కూడా ఇప్పటికీ వీరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.వారిద్దరూ అన్ని మర్చిపోయి ఎవరి దారి వారు అన్నట్లు ఉన్నప్పటికీ కూడా జనాలు మాత్రం వీరి వ్యక్తిగత విషయాలను ఇంకా తవ్వుతూనే ఉన్నారు.
వీరిని ప్రతిసారి హైలెట్ చేస్తున్నారు.నిజానికి ఏ సెలబ్రెటీలు విడిపోయిన కూడా ఇంతలా చేయలేరు అని చెప్పాలి.
కానీ ఈ జంట విడిపోవడంతో వారి అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు అసలు తట్టుకోలేక పోయారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత కొత్త కాలం అన్యోన్యంగా కనిపించిన ఈ జంట మూడేళ్లకే విడాకులు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోయారు.
ఇప్పటికీ వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు అంటే అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.వాళ్లకి ఇప్పటికీ సోషల్ మీడియాలలో మళ్ళీ కలవండి అంటూ సలహాలు ఇస్తున్నారు కానీ వారిద్దరు మాత్రం తమ తమ లైఫ్ లో బిజీగా ఉన్నారు.
నిజానికి ఈ జంట పెళ్లి తర్వాత చాలామందికి ఆదర్శంగా నిలిచింది.ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంత బాగుంటుందా అన్నట్లుగా చూపించారు ఈ జంట.ఒకరికొకరు ఎంతో ప్రేమను చూపిస్తూ కొందరు కుళ్లుకునేలా చేశారు.కానీ వీరిపై ఎవరి కన్ను పడిందో తెలియదు కానీ మొత్తానికి వారి బంధం ముక్కలైపోయింది.

ఏ విషయం పట్ల వీరు విడాకులు తీసుకున్నారో అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.ఇంతలా విడాకుల గురించి ట్రోల్స్ ఎదురవుతున్న కూడా సమంత( Samantha ) కానీ అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) కానీ విడాకుల కారణం మాత్రం బయట పెట్టడం లేరు.ఇద్దరిలో తప్పు ఎవరిది అనేది కూడా తెలియదు.కానీ ఇద్దరు మాత్రం మళ్ళీ కలిస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.ఇప్పటికీ వీరి సంబంధించిన గత వార్తలు, వీడియోలను మరోసారి వైరల్ చేస్తున్నారు.

అయితే గతంలో సమంత నాగచైతన్య పై చేసిన బోల్డ్ కామెంట్లు ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతున్నాయి.గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంతను యాంకర్.పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నాగచైతన్య లో ఎటువంటి మార్పులు గమనించారు అని ప్రశ్నించడంతో.
వెంటనే సమంత. పెద్దగా మార్పు అయితే ఏం లేవు అని.కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా కఠినంగా మారాడు అని తెలిపింది.

సాయంత్రం ఆరు తర్వాత ఇంట్లో సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడద్దు అని కండిషన్ పెట్టాడట.అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ రూల్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయించాడని తెలిపింది.ఇక పెళ్లికి ముందు తనతో షాపింగ్ కి వచ్చి గంటలు గంటలు సమయం గడిపే వాడని.
కానీ పెళ్లి తర్వాత షాపింగ్ కి వచ్చిన రోజే లేదు అని తెలిపింది.అయితే ఇప్పుడు ఈ మాటలు మరోసారి గుర్తు చేసుకున్న జనాలు.బహుశా నాగచైతన్య పెట్టిన కండిషన్స్ సమంత పాటించలేదేమో.అందుకే ఇలా విడాకులు జరిగాయేమో అని అనుమానం పడుతున్నారు.
