ఆడబిడ్డ పెండ్లికి మేనమామ ల మారిన సత్యం పేదింటి యువతి పెళ్లికి రూ. లక్ష సాయం అందించిన ఈటీసీఏ చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వీర్నపల్లి మండలం పేదింటి యువతి పెండ్లికి పెద్ద దిక్కుగా నిలవడమే కాకుండా పెండ్లి పందిరిలోనే లక్ష రూపాయల సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు ఈటీసీఏ అధ్యక్షుడు రాధారపు సత్యం.అడవిపదిర గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇటిక్యాల మంజుల- క్రీ శే, మల్లేశం కూతురు మాధవి – పర్శరాములు వివాహాం గురువారం వీర్నపల్లిలో జరిగింది.

 Satyam, Who Became Uncles For The Marriage Of A Girl Child, Paid Rs. Chairman Of-TeluguStop.com

వివాహానికి హజరైన సత్యం నూతన వధువరులను అశీర్వాదించారు.కుటుంబ అర్థిక పరిస్థితి తెలిసి చలించిపోయిన ఆయన పెండ్లి పందిరిలోనే ఒక లక్ష రూపాయల సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

ఈ సందర్భంగా సత్యం( Satyam )కు యువతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మడుగుల మల్లేశం, మహిళా మండల అధ్యక్షురాలు కళ, మాడుపు తిరుపతి రెడ్డి, లోకూర్తి తిరుపతి, తిరుపతి నాయక్, నీలం రాజేశ్ బాబు, అన్నారం అజయ్, దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube