జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమితో పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆ తరువాత కాంగ్రెస్ దూతలు నూతన పీసీసీ చీఫ్ కొరకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.
అయితే చివరిగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు వినిపించాయి.ఇక పీసీసీ చీఫ్ పేరును ఇద్దరిలో ఎవరిదో ఒకరి పేరు ఖరారవుతున్న తరుణంలో మరల కొంత మంది కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయం వాయిదా వేసుకుంది.
తరువాత ఎవరూ ఊహించకుండా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.ఇక పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి ఖరారవుంటతుం దని గట్టిగా ప్రచారం జరిగింది.
కాని అసలు ట్విస్ట్ ఏంటంటే జీవన్ రెడ్డి స్వయంగా హై కమాండ్ ను కలిసి పీసీసీ చీఫ్ గా నియమించవద్దని తెలిపినట్టు సమాచారం.ఈ పదవికి తాను న్యాయం చేయలేనేమోనని భావించి పీసీసీ చీఫ్ పదవికి నో చెప్పారని,ఇంకెవరికైనా సమర్థులకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ కు తెలిపినట్టు తెలుస్తోంది.