తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాల నటుడిగా పలు సినిమాలలో నటించి అనంతరం చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఒకరు.ప్రస్తుతం ఈయన తెలుగు చిత్ర పరిశ్రమంలో మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతుంది.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సెలబ్రిటీ మధ్య ఎంతో మంచి స్నేహభావం ఉండే విషయం మనకు తెలిసిందే.అయితే ఎన్టీఆర్ తో చనువుగా ఉంటూ ఆయనకే ఎంతోమంది మోసం చేసిన వారు ఇండస్ట్రీలో ఉన్నారు అలాంటి వారిలో నటి అక్కినేని అమల (Amala) కూడా ఒకరిని చెప్పాలి.

నాగార్జున కుటుంబానికి ఎన్టీఆర్ కి మధ్య ఎంతో అనుబంధం ఉందో మనకు తెలిసిందే.ఎన్టీఆర్ నాగార్జున(Nagarjuna) ను స్వయంగా బాబాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తార.ఇక అమల గారితో కూడా అదే మంచి అనుబంధంగా అయితే అమల మాత్రం ఎన్టీఆర్ కి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారట అమల చేసిన ఈ తప్పు కారణంగా అభిమానులు ఇప్పటికీ అమలపై కోప్పడుతూనే ఉంటారు.మరి ఎన్టీఆర్ విషయంలో అమలా చేసిన ఆ పొరపాటు ఏంటి అనే విషయానికి వస్తే…

అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం సినిమా(Manam Movie) ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.నిజానికి ఈ సినిమాని అక్కినేని హీరోలు అందరితో కలిసి చేయాలనే ఉద్దేశం డైరెక్టర్ కు ఏ మాత్రం లేదట అక్కినేని నాగేశ్వరరావు నాగార్జునను ఎంపిక చేసిన తర్వాత ఇందులో నాగచైతన్య (Nagachaitanya) ప్లేస్ లో ఎన్టీఆర్ అయితే బాగుంటుందని దర్శకులు ఎన్టీఆర్ కి ఈ అవకాశం కల్పించాలని చూశారట అయితే అదే సమయంలోనే అమల ఎన్టీఆర్ కి ఈ అవకాశం కల్పించకూడదని అడ్డుకున్నారట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ స్థానంలో అఖిల్ (Akhil)అయితే కరెక్ట్ గా సరిపోరా ఆయనని తీసుకుంటే తన సినీ కెరియర్ కి కూడా ఇది ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది అంటూ ఎన్టీఆర్ స్థానంలో అఖిల్ ని తీసుకోవాలని సూచించారట నాగేశ్వరరావు మాత్రం అఖిల్ కంటే ఈ సినిమాలో నాగచైతన్య అయితే ఇంకా బాగా సరిపోతుందని చెప్పి నాగచైతన్యాన్ని తీసుకున్నారు.చివరిలో అఖిల్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ ను డిజైన్ చేశారు.ఇలా అక్కినేని కుటుంబం అంతా కలిసి మనం సినిమాలో భాగమయ్యారు.
ఒకవేళ ఆరోజు అమల అడ్డుకోకపోయి ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించి ఉండేవారని అలా ఒకే తెరపై ఏఎన్ఆర్(ANR) ఎన్టీఆర్ మనవడు తారక్ నటించడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయ్యేదని ఎన్టీఆర్ కెరియర్ కి కూడా ఇదొక గొప్ప చిత్రంగా నిలిచిపోయేదని అలాంటి అవకాశం లేకుండా అమల చేశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.