తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమం ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగవ వారంలోకి అడుగు పెట్టారు.అయితే మూడో వారాలలో భాగంగా ఈ హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ ముగ్గురు కూడా లేడి కంటెస్టెంట్లు కావడం గమనార్హం.ఇక బిగ్ బాస్ మూడవ వారంలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి సింగర్ దామిని ( Singer Damini ) ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఎక్కువ కాలం పాటు హౌస్ లో కొనసాగుతారు అనుకున్నటువంటి ఈమె మూడవ వారం బయటకు రావడంతో అందరూ కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.అయితే బిగ్ బాస్ వారికి నచ్చని కంటెస్టెంట్లను ఇలా బయటకు పంపిస్తూ ఉంటారన్న కామెంట్లు తరచూ వినపడుతూ ఉంటాయి.

కంటెస్టెంట్లు ఎంత పెర్ఫార్మెన్స్ చేసిన బిగ్ బాస్ కి కనుక నచ్చకపోతే వెంటనే వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు.అందుకే ఈ కార్యక్రమానికి ఎవరు వెళ్లదు అంటు కొందరు కంటేస్టెంట్లు ఈ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఎక్కువ వారాలు ఉండేలాగా నిర్వాహకులు తన చేత ఒక అగ్రిమెంట్ ( Agreement ) రాయించుకున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇలా తనచేత అగ్రిమెంట్ రాయించుకున్నప్పటికీ బిగ్ బాస్ తనని మూడవ వారంలోనే బయటకు పంపించడంతో ఆమె కూడా షాక్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ నుంచి ఈమె బయటకు రావడానికి కూడా ప్రధాన కారణం లేకపోలేదు.ఈమె పెద్ద ఎత్తున హౌస్ లో బూతులు మాట్లాడటమే కాకుండా పోట్లాటకు కూడా సై అంటూ ఉంటారు.ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో దామిని పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇచ్చేది కాదు ఇలా టాస్కుల విషయంలో వెనుకబడి ఎక్కువ సమయం వంట గదిలోనే గడపటం వల్ల ఈమె ఎలిమినేట్( Damini Elimination ) కావడానికి కూడా కారణమైనదని తెలుస్తుంది.ఏది ఏమైనా ఎక్కువ వారాలకు ఈమె చేత అగ్రిమెంట్ రాయించుకున్నటువంటి బిగ్ బాస్ ఇలా మూడవ వారంలోకి పంపించడంతో ఈమె కూడా బిగ్ బాస్ కార్యక్రమం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది
.






