గురుపత్వంత్, ఎస్ఎఫ్‌జేలను నో ఫ్లయింగ్ లిస్ట్‌లో చేర్చండి : బైడెన్ ప్రభుత్వానికి ఎన్ఆర్ఐల విజ్ఞప్తి

ఖలిస్తాన్ వేర్పాటువాది, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూను( Gurpatwant Singh Pannun ) నో ఫ్లై లిస్ట్‌లో( No-Fly List ) చేర్చాలని ప్రవాస భారతీయులు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.ఇటీవల ఎయిరిండియా( Air India ) విమానాలను పేల్చివేస్తామంటూ పన్నూ చేసిన హెచ్చరికలు దుమారం రేపాయి.

 Diaspora Panel In Us Seeks To Include Extremist Pannun And Sfj On No-fly List De-TeluguStop.com

దీనిని సీరియస్‌గా తీసుకున్న అమెరికాలోని( America ) డయాస్పోరా ప్యానెల్ .పన్నూ, ఎస్ఎఫ్‌జేలను నో ఫ్లై లిస్టులో చేర్చాలని బైడెన్ పరిపాలనా యంత్రాంగాన్ని కోరింది.ఇండియన్ అమెరికన్, ఇండో కెనడియన్ల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐడీఎస్) నిర్వహించిన ‘Indians in Canada under Threat of Terror and Hate Crimes’ అనే చర్చా కార్యక్రమంలో నిపుణులు ఈ మేరకు సూచన చేశారు.ఎస్ఎఫ్‌జే, పన్నూలపై బలమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Telugu Air India, Canada Nris, Canadapm, Diaspora, Gurpatwantsingh, Hardeepsingh

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయని ఎఫ్ఐడీఎస్‌కు చెందిన ఖండేరావ్ కాండ్ వ్యాఖ్యానించారు.ఉగ్రవాద స్వేచ్ఛ కోసం భావ ప్రకటనా స్వేచ్ఛను ట్రూడో తప్పుగా చిత్రీకరించారని ఆయన ఎద్దేవా చేశారు.ట్రూడో భారతదేశంపై చేసిన ఆరోపణలు కెనడాలో( Canada ) భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక నేరాలను ప్రేరేపించాయని ఖండేరావ్( Khanderao Kand ) దుయ్యబట్టారు.ఇది అంతిమంగా కెనడాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన హెచ్చరించారు.1985 ఎయిరిండియా కనిష్క బాంబు దాడిని ప్రస్తావిస్తూ , బెదిరింపులకు పాల్పడిన గురుపత్వంత్ సింగ్ పన్నూ, ఎస్ఎఫ్‌జే సభ్యులు ‘‘నో ఫ్లై’’ లిస్టులో ఎందుకు లేరని కాండ్ ప్రశ్నించారు.

Telugu Air India, Canada Nris, Canadapm, Diaspora, Gurpatwantsingh, Hardeepsingh

పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదంతో పాటు భారత్‌లో హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ప్రమేయం వున్నందుకు గాను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రకారం ఎస్ఎఫ్‌జేను జూలై 2019లో భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినందుకు, పంజాబీ సిక్కు యువతను ఆయుధాలు పట్టాల్సిందిగా ప్రేరేపించినందుకు పన్నూను కూడా ఆ మరుసటి సంవత్సరం కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube