టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ పై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
అదేవిధంగా సీఐడీ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ.
కాగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడంపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి బయట ఉంటే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని సీఐడీ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.







