అల్లు అర్జున్ కు అంత సీన్ లేదని కామెంట్ చేశారు.. దర్శకుని సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu arjun ) పుష్ప, పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకులలో ఒకరైన డైమండ్ రత్నబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

 Diamond Ratnababu Sensational Comments Goes Viral In Social Media Details Here ,-TeluguStop.com

నాకు బాగా ఇష్టమైన వ్యక్తి బన్నీ అని డైమండ్ రత్నబాబు( Diamond ratnababu ) పేర్కొన్నారు.ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ అమీర్ ఖాన్ బన్నీ అని నేను చెప్పానని ఆయన తెలిపారు.

నేను ఆ విధంగా చెప్పడంలో కామెంట్లలో కొంతమంది ఓవరాక్షన్ చేయవద్దని బన్నీకి అంత సీన్ లేదని బన్నీ పాన్ వరల్డ్ ఆర్టిస్ట్ అవుతాడా? అని కామెంట్లు చేశారని అల్లు అర్జున్ కు ఎందుకు సోప్ వేస్తున్నావని అన్నారని డైమండ్ రత్నబాబు చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను నవ్వుకున్నానని బన్నీ గొప్ప స్థాయికి వెళతానని నాకు తెలుసని ఆయన తెలిపారు.బన్నీ జిమ్, డ్యాన్స్ చేయకుండా పడుకోరని డైమండ్ రత్నబాబు అన్నారు.

5 సంవత్సరాల క్రితమే బన్నీ ఈ స్థాయికి చేరుకుంటాడని నేను చెప్పానని ఆయన తెలిపారు.నా పేరు విన్న వెంటనే బన్నీ నవ్వారని సినిమా కథ పేరు గాలోడు అని చెప్పగానే బన్నీ నవ్వారని రత్నబాబు కామెంట్లు చేశారు.పిల్లా నువ్వులేని జీవితం సినిమాకు రైటర్ గా పని చేసే అవకాశం బన్నీ ద్వారా దక్కిందని ఆయన తెలిపారు.

నేను బన్నీని కలవడానికి సప్తగిరి కారణమని ఆయన చెప్పుకొచ్చారు.సప్తగిరి రుణం తీర్చుకోవాలని భావించి అన్ స్టాపబుల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చానని డైమండ్ రత్నబాబు అన్నారు.మీడియా వాళ్లకు నాపై ఎక్కువ ప్రేమ కాబట్టి ట్రోల్ చేశారని వాళ్లు మెచ్చుకునేలా చేయడమే నా టార్గెట్ అని ఆయన తెలిపారు.సాయితేజ్ ఇప్పటికీ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube