ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో పరిచయమవుతున్నారు.ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కొన్ని సినిమాల్లో నటించగా.
ప్రస్తుతం పలువురు బాలీవుడ్ బ్యూటీస్ తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ నటి తెలుగు సినిమాలో స్టార్ హీరో సరసన నటించింది.
అంతే కాకుండా ఈ సినిమా తో టాలీవుడ్ పై మరింత నమ్మకం పెట్టుకుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా. బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇక తెలుగులో అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించింది ఈ బ్యూటీ.అషిషొర్ సాల్మన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ దియా కొన్ని విషయాలు పంచుకుంది.

ఆమె ముంబైలో ఉన్నప్పుడు డైరెక్టర్ సాల్మన్ ఈ సినిమా పాత్ర గురించి చెప్పాడట.ఆ తర్వాత తనకు స్క్రిప్ట్ కూడా పంపాడట.ఇక ఆమెకు స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని తెలిపింది.మామూలుగా ఆమె ఏదైనా కొత్త సినిమా ఓకే చేయడానికి ముందు మూడు విషయాలు పరిగణనలోకి తీసుకుంటుంది.
మొదట ఆ సినిమా ఏ భాషలో తెరకెక్కుతుందని, రెండవది దర్శకుని ఎనర్జీని, మూడవది బృందాన్ని.ఇవన్నీ తనకు నచ్చితే సినిమాకు ఓకే చెపుతానని తెలిపింది.
ఇక ఆమెకు నాగార్జున అంటే చిన్నప్పటినుండి ఇష్టమని, ఆయన సిస్టర్ తన పేరెంట్స్ కి మంచి ఫ్రెండ్ అని తెలిపింది.ఇక ఈ సినిమా కోసం తమ బృందం ఎలాంటి వర్క్ షాప్స్ చేయలేదని ఫస్ట్ టైం నాగార్జునతో నటిస్తున్నందుకు చాలా భయం వేసిందని తెలిపింది.
కానీ ఆయన సింపుల్, గ్రౌండెడ్, నైస్ హ్యూమన్ బీయింగ్ అంటూ ఫస్ట్ సీన్ తోనే తమ మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.నాగార్జున మంచి సపోర్ట్ చేశాడని, షూటింగ్ చాలా బాగా జరిగిందని తెలిపింది.
ఇక మంచి కథలు వస్తే తెలుగు లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ, ఈ సినిమాతో తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతున్నానని తెలిపింది.