ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధర్నాకు దిగారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ మేరకు టీడీపీ ఎంపీల ఆందోళనలో నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం పార్లమెంట్ లో నారా లోకేశ్ వివిధ జాతీయ నేతలను కలవనున్నారని తెలుస్తోంది.కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.







