సెల్వ రాఘవన్ విడాకులు తీసుకున్న సమయంలో ధనుష్ ఇచ్చిన సలహా ఇదే!

స్టార్ హీరో ధనుష్ సార్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకోవడం కొన్ని నెలల క్రితం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

 Dhanush Suggestion To Selvaraghavan About Divorce Details Here Goes Viral , Dhan-TeluguStop.com

అయితే ధనుష్ సోదరుడైన సెల్వ రాఘవన్ కూడా సోనియా అగర్వాల్ తో విడిపోయారు.తమిళ, తెలుగు భాషల్లో దర్శకునిగా సక్సెస్ అయిన సెల్వ రాఘవన్ భార్యతో బేధాభిప్రాయాలు రావడం వల్ల ఆమెతో విడిపోవడం జరిగింది.

సెల్వ రాఘవన్ విడాకులు తీసుకున్న సమయంలో ధనుష్ ఇచ్చిన సలహా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.7/జీ బృందావన్ కాలనీ సినిమా ద్వారా సోనియా, సెల్వ రాఘవన్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.సోనియా సెల్వ రాఘవన్ విడిపోవడం అభిమానులను సైతం ఎంతగానో హర్ట్ చేసింది.2006 సంవత్సరంలో సోనియా సెల్వ రాఘవన్ వివాహం జరగడం గమనార్హం.

2010 సంవత్సరంలో పర్సనల్ రీజన్స్ వల్ల సోనియా సెల్వ రాఘవన్ విడాకులు తీసుకోవడం జరిగింది.సెల్వ రాఘవన్ తన విడాకుల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఈ విషయాలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఆ సమయంలో ధనుష్ నాతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా దీని నుంచి బయటపెడితే దేవుడు సరైన అవకాశం ఇస్తాడని చెప్పాడని సెల్వ రాఘవన్ అన్నారు.

ఆ తర్వాత నేను గీతాంజలి రామన్ ను పెళ్లి చేసుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.గీతాంజలి రామన్ వల్ల నా లైఫ్ లో ఊహించని మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం మేమిద్దరం సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.

సెల్వ రాఘవన్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ధనుష్, సెల్వ రాఘవన్ కెరీర్ పరంగా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube