ధనుష్ 51( Dhanush 51 )వ సినిమాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.ఏసియన్ నిమాస్స్ బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.
సినిమాలో రష్మిక మందన్నని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తూ రీసెంట్ గా ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట.
ఆల్రెడీ శేఖర్ కమ్ములతో ఫిదా, లవ్ స్టోరీ రెండు సినిమాల్లో సాయి పల్లవి( Sai Pallavi ) హీరోయిన్ గా నటించింది.ఇక ధనుష్ తో మారి 2 లో కలిసి చేసింది.
శేఖర్ కమ్ములతో సాయి పల్లవి హిట్ కాంబినేషన్ కాబట్టి సాయి పల్లవిని ధనుష్ సినిమాలో కూడా తీసుకోవాలని అనుకున్నారట.కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్ గ్లామర్ షో( Glamor Show ) చేయాల్సి ఉండటం వల్ల ఆ ఛాన్స్ వదులుకుంది సాయి పల్లవి.పాత్ర ప్రాధాన్యత ఉన్నా గ్లామర్ షో అంటే తన వల్ల కాదని చివరి నిమిషంలో సినిమా చేయలేనని చెప్పిందట సాయి పల్లవి.సో అలా సాయి పల్లవి కాదన్న ఛాన్స్ రష్మిక( Rashmika ) పట్టేసింది.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు తక్కువ అవుతున్నాయి అనుకున్న టైం లో రష్మికకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అయ్యింది.