బిగ్ బాస్ రెమ్యునరేషన్ గుట్టు విప్పిన ధనరాజ్.. అదే పెద్ద తప్పు అంటూ?

బిగ్ బాస్ సీజన్1 తెలుగుకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ఫస్ట్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లలో ధనరాజ్ ఒకరనే సంగతి తెలిసిందే.తాజాగా ధనరాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ షోను వదిలేయడం నా లైఫ్ లో చేసిన పెద్ద తప్పు అని అన్నారు.

 Dhanaraj Comments About Bigg Boss Show Remuneration Details Here Goes Viral , Sa-TeluguStop.com

మా ఆవిడ బిగ్ బాస్ చూసేదని నాకు ఆ షో గురించి అస్సలు ఆసక్తి ఉండేది కాదని ధనరాజ్ చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయానని ధనరాజ్ తెలిపారు.

ఆ షోకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.ముమైత్ ఖాన్ బయటకు వెళ్లిన సమయంలో నేను చాలా ఫీలయ్యానని ఆయన తెలిపారు.బిగ్ బాస్ హౌస్ నుంచి మనకు మనం వెళితే 25 లక్షల రూపాయలు కట్టాలని ఆయన చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షోలో నా ఎలిమినేషన్ రోజు బాబు పుట్టాడని ఆయన అన్నారు.

నాకు వారానికి 7.5 లక్షల రూపాయలు ఇచ్చారని ధనరాజ్ అన్నారు.బిగ్ బాస్ లో వీక్లీ పేమెంట్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.సంపూర్ణేష్ బాబు విషయంలో తారక్ జోక్యం చేసుకుని అతనిని బయటకు పంపించారని ధనరాజ్ అన్నారు.బిగ్ బాస్ హౌస్ లో ముమైత్ ఖాన్ వల్ల ఇబ్బంది పడ్డానని ధనరాజ్ చెప్పుకొచ్చారు.కెప్టెన్ కావాలని కూడా నేను అనుకోలేదని ధనరాజ్ వెల్లడించారు.

Telugu Bigg Boss Show, Dhanaraj, Dhanarajbigg, Ntr, Mumait Khan-Movie

నేను సినిమా ఆర్టిస్ట్ గానే ఉండాలని అనుకున్నానని ధనరాజ్ కామెంట్లు చేశారు.బిగ్ బాస్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని ధనరాజ్ అన్నారు.బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదని ఆయన అన్నారు.ధనరాజ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube