మాస్ రాజా ఇంట్లో ధమాకా సక్సెస్ సెలెబ్రేషన్స్.. పిక్స్ వైరల్!

ఇటీవల కాలంలో మాస్ మహారాజా రవితేజ సినిమాలకు భారీ క్రేజ్ రావడం లేదు.ఎందుకంటే ఒక సినిమాతో హిట్ అందుకుంటే వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.

 Dhamaka Movie Team Success Meet, Dhamaka Success Meet, Ravi Teja, Dhamaka Movie,-TeluguStop.com

దీంతో రవితేజ సినిమాలు అంటే క్రేజ్ తగ్గిపోతుంది.అయితే తాజాగా రవితేజ నటించిన సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్ పెరిగి పోయింది.

విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు.

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’.

ఈ సినిమా కోసం రవితేజ కూడా ఆయన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై హైప్ పెరిగేలా చేసాడు.ఇక భారీ అంచనాలతో ధమాకా సినిమా నిన్న డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

19 కోట్ల టార్గెట్ తో రవితేజ బరిలోకి దిగాడు.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల రవితేజకు జోడీగా నటించింది.క్రిస్మస్ బరిలో దిగిన ఈ సినిమాను వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ధమాకా యూనిట్ మొత్తం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొద్దీ సేపటి క్రితం మాస్ రాజా రవితేజ ఇంట్లో సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.రవితేజతో పాటు ధమాకా యూనిట్ సభ్యులు ఈ సెలెబ్రేషన్స్ లో భాగం అయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్షన్స్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube