లోకేష్ అరెస్టును ఖండించిన దేవినేని ఉమా..!!

తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ నరసరావుపేట పర్యటన ఏపీ రాజకీయాలలో ఉత్కంఠ భరితంగా మారింది.

అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించిడానికి హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకున్న నారా లోకేష్ ని పోలీసులు విమానాశ్రయం లోపల అదుపులోకి తీసుకున్నారు.

పర్యటనకు అనుమతి లేదని అక్కడి నుంచి ఆయనను తిరిగి వెనక్కి పంపడానికి రెడీ అవ్వడం జరిగింది.ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఏపీ రాష్ట్ర పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

తాను ఏమాత్రం ధర్నా గాని పాదయాత్ర గాని చేయడం లేదని అసలు అనుమతి ఎక్కడ ఎవరిని అడగ లేదని అన్నారు.కేవలం బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవటం అన్యాయమని లోకేష్ పోలీసులపై మండిపడ్డారు.

గత ఫిబ్రవరి 24వ తారీఖు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూహ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేష్ వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర స్థాయిలో పోలీసు వ్యవస్థపై లోకేష్ సీరియస్ అయ్యారు. 

Advertisement

ఇక ఇదే తరుణంలో నారా లోకేష్ అరెస్టును తీవ్రంగా ఖండించారు టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో కామెంట్లు పెట్టారు.దేవినేని ఉమ ఏమన్నారంట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అరెస్ట్ అప్రజాస్వామికం.

ఆడబిడ్డలకు న్యాయం చేయాల‌ని అడిగితే అరెస్టు చేస్తారా? లోకేశ్ పర్యటనకు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు వైఎస్ జ‌గ‌న్ అని ఆయ‌న మండిప‌డ్డారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు