మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రధానమంత్రి మోదీ పర్యటనతో హైదరాబాద్ ప్రగతిభవన్ లో భూకంపం మొదలైందని తెలిపారు.
కల్వకుంట్ల కుటుంబంలో లొల్లి స్టార్ట్ అయిందన్న బండి సంజయ్ కేటీఆర్ సీఎం అభ్యర్థి అయితే ఎమ్మెల్యేలు బయటకొస్తారన్నారు.కేటీఆర్ భాషను చూసి తెలంగాణ సిగ్గు పడుతోందని చెప్పారు.
ఎక్కడైనా భారతదేశానికి గుర్తింపు దక్కుతుంది అంటే దానికి కారణం మోదీ అని చెప్పారు.మోదీ వస్తేనే తెలంగాణలోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబం ప్లాన్ ప్రకారం మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
అయితే కేసీఆర్ కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.