రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి: సీఎం జగన్

మూడేళ్లలో రాష్ట్రంలో 99 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని సీఎం జగన్ తెలిపారు.ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధిపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు.

భారీ పరిశ్రమల ద్వారా రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.వీటి ద్వారా రాష్ట్రంలో 62,541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు.మరో రూ.91 వేల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఎంఎస్ఎంఈల ద్వారా రూ.9,742 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న జగన్.మూడు సంవత్సరాలలో ఏపీకి సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు.అదేవిధంగా రాష్ట్రంలో విశాఖ -చెన్నై, చెన్నై - బెంగళూరు, హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో 30 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అడుగులు వేగంగా పడుతున్నాయని ఆయన వెల్లడించారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు