వచ్చే జన్మలో అభిమానుల రుణం తీర్చుకుంటాను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కథల ఎంపిక ఇతర నటీనటులకు భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

టెంపర్ సినిమా నుంచి దేవర సినిమా వరకు సినిమా సినిమాకు భిన్నమైన రోల్స్ ను ఎంచుకున్న తారక్ తన సక్సెస్ రేట్ ను పెంచుకోవడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ వేర్వేరు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.

అయితే పార్క్ హయత్ లో దేవర టీమ్ పార్టీ చేసుకోగా ఈ పార్టీలో తారక్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ జన్మకు అభిమానులకు ఇచ్చేది వడ్డీ మాత్రమేనని వచ్చే జన్మలో అభిమానుల రుణం తీర్చుకుంటాను అని తారక్ కామెంట్లు చేశారు.దేవర సినిమా సక్సెస్ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తారక్ చెప్పకనే చెప్పేశారు.

బృందావనం సినిమాతో కొరటాల(Koratala Siva )తో ప్రయాణం మొదలైందని ఎన్టీఆర్ అన్నారు.

Advertisement

ఆ సినిమా నుంచి కొరటాల శివ( Koratala Shiva ) మా కుటుంబ సభ్యులలో ఒకరు అయ్యారని తారక్ వెల్లడించారు.దేవర సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తారక్ తెలిపారు.దేవర సీక్వెల్ స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ కు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవర సీక్వెల్ బడ్జెట్ పరంగా కూడా భారీ మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటుండగా భిన్నమైన సినిమాల్లో నటించడం వల్ల తారక్ మార్కెట్ పెరుగుతోంది.

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్ లకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.అన్ని ఏరియాలలో ఈ సినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంటోంది.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?
Advertisement

తాజా వార్తలు