అక్కడ ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న దేవర.. తారక్ మాస్ జాతర వేరే లెవెల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ రిలీజ్ కు 26 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి.

ఇప్పటికే ప్రీ సేల్స్ తో ఈ సినిమాకు 70 వేల డాలర్ల కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.పరిమిత సంఖ్యలో థియేటర్లలోనే దేవర ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం.

పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే మాత్రం ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.దేవర సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

దేవర సినిమాలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Advertisement

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా నుంచి విడుదలైన చుట్టమల్లే సాంగ్ కు అన్ని భాషల్లో ఏకంగా 125 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ఈ సాంగ్ తెలుగు వెర్షన్ త్వరలో సులువుగా 100 మిలియన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

దేవర సినిమా( Devara movie ) ఐదు భాషల్లో విడుదల కానుండగా ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రముఖ బ్యానర్లు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.దేవర సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తారక్ మాస్ జాతర వేరే లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు