Dev raturi : చైనాలో స్టార్ హీరో..కానీ ఆయన భారతీయుడు అని మీకు తెలుసా?

దేవ్ రాటూరి( Dev raturi ) గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.చైనాలో స్టార్ అయిన దేవ్ రాటూరి భారతీయుడే.

ఇప్పుడంటే సినిమాల్లో నటిస్తున్నాడని మాత్రమే చాలా మందికి తెలుసు.కానీ దేవ్ రాటూరి ఎనిమిది రెస్టారెంట్ లకు యజమాని కూడా.

ఇప్పుడు చైనా ప్రభుత్వం దేవ్ రాటూరి గురించి పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చింది.మరి దేవ్ రాటూరి గురించి పూర్తిగా ఒకసారి తెలుసుకుందామా.

దేవ్ రాటూరి ఉత్తరాఖండ్‌ ( Uttarakhand )లోని తెహ్రీ గఢ్వాల్‌ జిల్లాలో( Garhwal district ) జన్మించారు.సొంత గ్రామం నుంచి చైనా వెళ్లారు.దేవ్ రాటూరి బ్రూస్ లీ( Bruce Lee )కి పెద్ద అభిమాని.

Advertisement

బ్రూస్ లీ అడుగుజాడల్లోనే నడవాలనుకున్నాడు. హిందీ సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కి కూడా వెళ్ళాడు.

కానీ సెలెక్ట్ కాలేదు.నిరాశకు గురైన దేవ్ రాటూరికి కరాటేపై ఆసక్తి పెరిగింది.

దీంతో ఆయన 2005లో చైనాకు వెళ్లాడు.ఉపాధి కోసం ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా కూడా పనిచేసారు.

చైనాలోనే ఉంటూ రెండేళ్లలో చైనీస్ భాషని కూడా పూర్తిగా నేర్చుకున్నాడు.ఆ తరువాత ఒక రెస్టారెంట్ కి మేనేజర్ అయ్యాడు.అంతటితో ఆగకుండా కొందరితో కలిసి ఒక సొంత రెస్టారెంట్ ని కూడా ప్రారంభించారు.2011లో భారత్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేసుకొని మల్లి చైనాకి వెళ్ళిపోయాడు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

2013 లో సొంతంగా ఒక రెస్టారెంట్ ని ప్రారంబించాడు.2015 లో కూడా ఒక రెస్టారెంట్ ని ప్రారంబించాడు.ఇప్పటికి మొత్తం దేవ్ రాటూరికి ఎనిమిది రెస్టారెంట్ లు ఉన్నాయి.

Advertisement

కానీ దేవ్ రాటూరికి నటుడు కావాలన్నా కోరిక అలానే ఉండిపోయింది.చివరికి 2016 లో అతని కోరిక నెరవేరింది.

చైనా సినిమాలో ఒక ఛాన్స్ వచ్చింది.ఈ సినిమాలో ఒక ఇండియన్ గా, నెగటివ్ రోల్ లో నటించాడు.

ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస అవకాశాలు తెచ్చుకున్నాడు.ఆ తరువాత కొన్నేళ్ళకే స్టార్ అయ్యాడు.

ఇలా ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా ఉన్న దేవ్ రాటూరి ఎనిమిది రెస్టారెంట్ లకి ఓనర్ మాత్రమే కాకుండా తన కోరికను నెరవేర్చుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.దీంతో చైనా ప్రభుత్వం అతని గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చింది.

తాజా వార్తలు