పొత్తు ఉన్నా జనసేన సైలెంట్ ! బీజేపీ టెన్షన్

ఏపీలో బీజేపీ జనసేన పొత్తు వ్యవహారం చిత్ర విచిత్రంగా మారింది.రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నా.ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో,  వీరి పొత్తు వ్యవహారం ఎవరికి అంతు పట్టడం లేదు.2024 ఎన్నికల్లో జనసేన , బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ఒకపక్క ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలు చేస్తున్నా,  జనసేన మాత్రం సైలెంట్ గానే ఉంటుంది.ప్రస్తుతం చూస్తే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతుంది.జనసేన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా.బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.

 Despite The Alliance Janasena Is Silent Bjp Tension, Ap, Ap Bjp, Janasena, Pavan-TeluguStop.com

ఈ సమయంలో బిజెపి అభ్యర్థులకు జనసేన మద్దతు ప్రకటించాల్సి ఉన్న,  జనసేన సైలెంట్ గానే ఉండిపోయింది.పైగా వైసిపి అభ్యర్థులను ఓడించాలంటూ జనసేన తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

కానీ ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని చెప్పకపోవడంపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Telugu Ap Bjp, Janasena, Janasenapac, Janasenani, Mlc, Pavan Kalyan, Somu Veerra

ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి తరఫున ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.ఉత్తరాంధ్ర ,తూర్పు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.ఈ ముగ్గురిని గెలిపిస్తానంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రచారం నిర్వహిస్తున్నారు .కానీ జనసేన మాత్రం ఈ ప్రచారానికి , బిజెపి అభ్యర్థులకు మద్దతు కు దూరంగానే ఉంది.  బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరకుండా , కేవలం వైసీపీ అభ్యర్థులను ఓడించాలంటూ ప్రకటన చేయడం పై ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఒకపక్క పొత్తు కొనసాగిస్తూనే , మరోపక్క తమకు తగిన సహకారం అందించకపోతే,  ఎలా అంటూ జనసేన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ విషయంలో జనసేన నాయకులలోను అయోమయం నెలకొంది.

వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దని చెప్పారే కానీ , తాము ఎవరికి ఓటు వేయాలో చెప్పకపోవడంపై వారిలోనూ గందరగోళం నెలకొంది.ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని జనసేన కార్యకర్తలతో పాటు , బిజెపి కూడా ఎదురుచూపులు చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube