దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
అలాగే బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారికంగా ఏదీ ప్రకటించే వీలు లేదని తెలిపారు.
అదేవిధంగా బీసీల అభివృద్ధికి కాంగ్రెస్( Congress ) కట్టుబడి ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రజా ప్రభుత్వమన్న ఆయన తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.