ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.అసెంబ్లీ లాబీలో మీడియా వారితో పిచాపాటీ మాట్లాడుతూ.
సభలో అన్ని విషయాల్లో సీఎం బాబు ముందుండి మాట్లాడుతున్నాడు.మంత్రులకు సభలో మాట్లాడే అవకాశం కల్పించడం లేదు.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రశ్నలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తుండటంతో మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోతుందని ఈయన వాపోతున్నాడు.
ఇక రాజధాని విషయంలో కూడా ఈయన కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.
రాజధాని ఏర్పాటుకు శంకుస్థాపన జరగాలంటే కనీసం మరో రెండు సంవత్సరాలు అయినా పడుతుందని అన్నాడు.గతంలో కూడా కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడును అగౌరవ పర్చుతూ మాట్లాడాడు.
ఈయన మాటలు ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు అస్త్రాలుగా మారిపోతున్నాయి.దాంతో ప్రభుత్వ పెద్దలు ఈయనపై సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి, ప్రభుత్వంపై ఇలా వ్యతిరేకంగా మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ ఆయను టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.







