మెగా ఫ్యామిలీ నుండి ‘ముకుంద’ చిత్రంతో తెరంగేట్రం చేయబోతున్న హీరో వరుణ్‌తేజ్.మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న ‘ముకుంద’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఇక ఈ సినిమాలో మరో మెగా హీరో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు అనే వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.దాంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో వస్తున్నాయి.
అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ తేల్చేశాడు వరుణ్ తేజ్.
ఈ సినిమాలో మరో మెగా హీరో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ వరుణ్‌తేజ్ క్లారిటీ ఇచ్చాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉంటుందని వరుణ్ అంటున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఒక లైలా కోసం’ ఫేం పూజా హెగ్డే నటించింది.
సినిమాలో హీరో, హీరోయిన్‌ల పేర్లు చివరి వరకు తెలియకుండా కథ సాగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.







