మెగా హీరోతో కొరటాల శివ?

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న కొరటాల శివ మరో బంపర్‌ ఆఫర్‌ను దక్కించుకున్నాడు.ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కాగానే మెగా హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

 Koratala Siva To Direct Mega Hero-TeluguStop.com

తాజాగా కొరటాల శివ చెప్పిన కథకు అల్లు అర్జున్‌ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.‘మిర్చి’ చిత్రంతో స్టార్‌ దర్శకుడిగా మారిపోయిన కొరటాల శివతో పలువురు యంగ్‌ హీరోలు సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అయితే కొరటాల మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

‘మిర్చి’ చిత్రం తర్వాత చాలా కాలం ఎదురు చూసి మరీ సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నాడు.

కొరటాల శివకు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో ఒక సినిమా చేసే అవకాశం దక్కింది.పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయ్యింది.

అయితే కొరటాల శివ మరో మెగా హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్‌ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం కానున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకు భారీ క్రేజ్‌ ఉండే అవకాశముంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube