Delhi Police : పోలీసు వార్నింగ్ లైట్‌తో SUV ఓనర్ డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్..

ఈరోజుల్లో సోషల్ మీడియాలో చాలానే వెహికల్స్ స్టంట్( Vehicles Stunt ) వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలను మనకు గమనిస్తే స్టంట్స్ కోసం ప్రజలు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

ఈ వెర్రి చేష్టల వల్ల వారే కాకుండా ఇతరులు కూడా ప్రమాదంలో పడుతున్నారు.ఇలాంటి స్టంట్స్ భారత దేశ వ్యాప్తంగా చేస్తున్నారు.

ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో( Delhi-NCR ) యువకులు తమ డ్రైవింగ్ స్టంట్లతో ప్రజలకు హడల్ పుట్టిస్తున్నారు.సోషల్ మీడియాలో ఆ వీడియోలు షేర్ చేసి ఫేమస్ అవ్వాలనే ఓ పిచ్చి కోరిక వల్ల వారు తరచుగా భద్రతా నియమాలను విస్మరిస్తున్నారు.

దీనిని పరిష్కరించడానికి, చట్టాన్ని ఉల్లంఘించే డ్రైవర్లకు జరిమానా విధించడానికి ప్రభుత్వాలు పోలీసు తనిఖీ కేంద్రాలను పెంచాయి.దీని ఫలితంగానే ఓ ప్రమాదకరమైన డ్రైవింగ్ స్టంట్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకోగలిగారు.

Advertisement

అతడు నంబర్ ప్లేట్లు లేని తెల్లటి SUVని నడుపుతూ నజఫ్‌గఢ్-రాజౌరీ గార్డెన్ రోడ్డులో ప్రమాదకర విన్యాసాలు చేశాడు.సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి పోలీసులు అతడిని గుర్తించారు.

రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్‌కు( Rajouri Garden Metro Station ) సమీపంలో వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాన్ని ఎక్స్‌ ప్రముఖ వార్తా సంస్థ ANI పోస్ట్ చేసింది.ఈ వీడియోలో తెల్లటి ఫార్చ్యూనర్ కారు( Fortuner Car ) ఫ్రంట్ డోర్ ఓపెన్ అయి ఉండటం మనం చూడవచ్చు, ఆ సమయంలో కారు రోడ్డుపై వేగంగా వెళ్తోంది.డ్రైవర్ కెమెరా వైపు చేయి ఊపాడు.

కారు సినిమా దృశ్యాన్ని తలపిస్తూ హఠాత్తుగా మలుపులు తిరుగుతూ కనిపించింది.ఈ కారు పైన పోలీస్ కారు పై కనిపించే ఒక వార్నింగ్ సిగ్నల్ లైట్ కూడా యాడ్ చేశారు.

ఒక పోలీస్ కారు వలె జనాలకు కనిపించేలా దాన్ని రూపొందించారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఎక్స్‌లో కూడా షేర్ చేసిన ఈ కారు స్టంట్ వీడియో 500,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది, చాలా మంది వ్యక్తులు అలాంటి డ్రైవింగ్ ప్రమాదాల గురించి వ్యాఖ్యానించారు.ఇలాంటి చర్యల నుంచి ఇతరులను అరికట్టేందుకు కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement

మొత్తంమీద, ఈ సంఘటన ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదాలను, ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ చట్టాలను అనుసరించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది.డ్రైవర్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

తాజా వార్తలు