దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసు విచారణ కీలక దశకి చేరింది.ఇందులో భాగంగా ఇవాళ అరుణ్ పిళ్లై, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నించనుంది.
రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రెండోసారి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.ఆరు రోజులుగా కస్టడీలో ఉన్న మనీశ్ సిసోడియాను, తొమ్మిది రోజులుగా అరుణ్ పిళ్లైను అధికారులు విచారిస్తున్నారు.లిక్కర్ పాలసీ రూపకల్పన, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, ఆధారాల ధ్వంసంపై ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే నిందితుల నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారని సమాచారం.మరోవైపు ఏప్రిల్ మొదటి వారంలో రెండవ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ ఫైల్ చేయనుంది.
కాగా మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు ఈడీ 12 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.వీరిలో పది మంది ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.