ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: సిసోడియా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆయన భార్యతో పాటు మరి కొంతమందికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఈ అటాచ్ మెంట్ లో రూ.11.49 లక్షల విలువైన సిసోడియా బ్యాంక్ బ్యాలెన్స్ లు, బ్రిండ్ కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.16.45 కోట్లు సహా రూ.44.29 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.కాగా మొత్తం అటాచ్ మెంట్ విలువు రూ.52.24 కోట్లని ఈడీ వెల్లడించింది.అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిసోడియా, ఆయన భార్య, రాజేశ్ జోషి మరియు గౌతమ్ మల్హోత్రాలకు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు