దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Policy Case )లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని తెలుస్తోంది.ఈ మేరకు కేజ్రీవాల్ ను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగనుంది.
రేపటితో కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఈడీ కస్టడీ ముగియనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈడీ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరనుందని తెలుస్తోంది.ఈడీ కస్టడీ ముగిసిన తరువాత కేజ్రీవాల్ ను సీబీఐ కస్టడీకి కోరనుందని సమాచారం.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.