కరోనా టైంలో అన్ని రంగాలు స్తంభించిపోయాయి.దీనిలో తను నడిపే ఢాబా వ్యాపారం కూడా ఉందని వీడియోలో కంటతడి పెట్టుకున్న దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ కు చెందిన కాంతా ప్రసాద్ మరియు అతని భార్య బాదామి దేవి బాధను చూసి తట్టుకోలేకపోయిన సెలబ్రిటీలందరూ తమ అభిమానులు బాబా కా ఢాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్‌లు చేశారు.
దీనితో ప్రజల నుండి మంచి స్పందన లభించింది.ఆ వృద్ధ జంట సమస్య తీరింది.
తాజాగా ఈ జంట తమకు న్యాయం చేయాలని పోలీసులని ఆశ్రయించారు.ఇంతకీ విషయమేంటంటే తమ వీడియో చూసి తమకు సహాయం చేయడం కోసం విరాళాలు సేకరించిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్.తమకు దాతలు ఇచ్చిన మొత్తంలో కేవలం 2.3 లక్షలు చెల్లించి మిగిలింది తానే ఉంచుకున్నాడని విరాళాల కోసం అతడు తన బ్యాంక్ అకౌంట్,అలాగే ఇతర కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను ఇచ్చాడని ఎలాగైనా తప్పుదోవ పట్టిన డబ్బును పోలీసులు పట్టుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఫిర్యాదు చేశామని కాంతా ప్రసాద్ అన్నారు.ఇక ఈ విమర్శల పై స్పందించిన వాసన్ తన బ్యాంక్ స్టేట్ మెంట్స్ చూపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.