ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరొకసారి తన మ్యానియా మొత్తం చూపిస్తున్నాడు.ఈయన తాజాగా నటించిన చిత్రం పుష్ప.
గ్లామర్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్ల వేట కొనసాగిస్తుంది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో విడుదల చేయగా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.అంతటా ఒకేలాగా అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఈ సినిమాతో అల్లు అర్జున్ హిందీ తెరపై కూడా మెప్పించాడు.
ఈ సినిమా విడుదల చేసినప్పటి నుండి ఏదొక అప్డేట్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు.
ఇక తాజాగా ఇప్పుడు సినిమాలోని ఒక డిలేటెడ్ సీన్ ను విడుదల చేసారు.ఈ వీడియోలో పుష్ప కు అప్పు ఇచ్చిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి అప్పు ఇవ్వలేదని గొడవ చేస్తున్న సీన్ అది.ఈ సీన్ లో పుష్ప రాజ్ మిల్లులో పని మానేసాడు అని వాళ్ళ అమ్మకు చెప్పేసాడు.ఏ మాత్రం బాధ్యత లేని యువకుడిగా కనిపించిన పుష్పరాజ్ తమ గేదెను అమ్మి మరి అప్పు తీర్చేసాడు.
అయితే ఇక్కడే అసలు సీన్ మొదలయ్యింది.పుష్పరాజ్ కు అప్పు ఇచ్చిన వ్యక్తి గొడవ చేసి అందరికి తెలిసేలా చేసాడని.పుష్ప అప్పు తీర్చిన తర్వాత అప్పు తీర్చినట్టు అందరికి తెలిసేలా చేయమని ఇంటింటికి వెళ్లి మరి కొట్టుకుంటూ అతడితో పుష్పరాజ్ అప్పు ఇచ్చేసాడు అని చెప్పిస్తాడు.ఈ సీన్ లో ఇదే హైలెట్.
పుష్పరాజ్ హీరోయిజాన్ని థియేటర్స్ లో అందరు మిస్ అయ్యారు.