దీపికా సినిమా చపాక్ పై పడ్డ భజరంగ్ దళ్... హిట్ గ్యారెంటీనా

ఈ మధ్యకాలంలో సినిమాల చుట్టూ వివాదాలు రాజుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.

సినిమాలు దర్శకులు పెట్టె విషయాలు కొంత మంది మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని కోర్టుకి ఎక్కడం రెగ్యులర్ గా చూస్తున్నదే.

అయితే ఇలా బాలీవుడ్ లో ఇలా వివాదాస్పదం అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.అమీర్ ఖాన్ పీకే నుంచి, దీపికా పద్మావతి సినిమా వరకు అన్ని సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఆ సినిమాలు కంటెంట్ పరంగా వివాదాస్పదం అయితే తాజాగా దీపికా నటించిన చపాక్ సినిమా వేరొక విధంగా వివాదాస్పదం అయ్యింది.జేఎన్‌యూలో ఏబీవీపీ వర్గీయుల యూనివర్సిటీలో చోరపడి విద్యార్ధుల మీద విచక్షణా రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో చాలా మంది విద్యార్ధులు గాయపడ్డారు.ఇక ఈ ఘటనని బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఖండించారు.

Advertisement

బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, హిందుత్వ ముసుగులో జరుగుతున్నా దాడులని విమర్శించారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే మరో రెండు అడుగులు ముందుకేసి జే.ఎన్.యూ గాయపడ్డ స్టూడెంట్ లీడర్ ని పరామర్శించడానికి వచ్చింది.దీంతో ఆమెపై ఆగ్రహంతో ఆమె సినిమా చపాక్ ని బహిష్కరించాలని, ఏబీవీపీ కార్యకర్తలు, భజరంగ్ దళ్ వర్గీయులు పిలుపునిచ్చారు.

ఓ విధంగా ఈ వ్యవహారం బీజేపీ సానుభూతిపరులకి కోపం తెప్పించింది.దీంతో దీపికా సినిమాపై వారి కోపాన్ని చూపించారు.అయితే ఇలా హిందుత్వ సంస్థల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ సినిమాలు అన్ని హిట్ కావడంతో ఆ సెంటిమెంట్ చపాక్ కి కూడా కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు.

జేఎన్‌యూ విజిట్‌తో దీపిక హీరో అయిపోయిన ఆమె సినిమాకు ఎంత వరకు సక్సెస్ అందుతుంది అనేది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు