చివరకు విషాదంగా ముగిసిన దీక్షిత్ రెడ్డి కిడ్నాప్.. పెట్రోల్ పోసి దారుణ హత్య చేసిన కిడ్నాపర్లు ..!

మహబూబాబాద్ జిల్లా లోని క్రిష్ణ కాలనీలో నివాసం ఉంటున్న వసంత, రంజిత్ పెద్ద కుమారుడు తొమ్మిది సంవత్సరాలు ఉన్న దీక్షిత్ రెడ్డి ఇంటి ముందర ఆడుకుంటుండగా ఆదివారం నాడు సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఆ అబ్బాయిని అపహరించారు.ఇలా బాలుడు తప్పిపోవడంతో బాలుని కోసం తల్లి తండ్రులు వెతుకుతున్న సమయంలో కిడ్నాపర్లు తల్లి వసంత కు ఫోన్ చేసి తమకి రూ.45 లక్షలు ఇస్తేనే పిల్లాడిని విడిచి పెడతామని ఈ విషయాన్ని మీరు ఎక్కడ చెప్పవద్దు, పోలీసులకు కంప్లైంట్ చేయవద్దు అంటూనే మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మా వ్యక్తులు ఉన్నారని వారిని బెదిరించారు.

 Nine Year Old Boy Murdered By Kidnappers, Kidnappers, Deekshith Reddy, 45lakhs,-TeluguStop.com

అలాగే మళ్లీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేసి డబ్బులు సిద్ధం చేయండి బుధవారం ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసిన కిడ్నాపర్లు, ఆ తర్వాత బుధవారం నాడు ఉదయం 11 గంటలకు ఫోన్ చేసి డబ్బు సిద్ధం చేసుకుని జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా ప్రాంతానికి రావాలని వారు సూచించారు.

అయితే కిడ్నాపర్ డిమాండ్ చేసిన డబ్బులో తల్లిదండ్రులకు వీలైనంతవరకు పోగు చేసి ఆ సొమ్మును మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కిడ్నాపర్లు చెప్పినట్టుగా బాలుడు తండ్రి రంజిత్ ఆ డబ్బులు తీసుకొని మహబూబాబాద్ మూడు కొట్ల చౌరస్తా ప్రాంతానికి చేరుకున్నాడు.ఇకపోతే కిడ్నాపర్లు సూచించిన ప్రాంతంలో వారి కోసం బుధవారం రాత్రి వరకు తండ్రి వేచి చూశాడు.

అయితే కిడ్నాపర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటికి తిరిగి అతను వచ్చేశాడు.అయితే తండ్రి డబ్బు ఇచ్చే సమయంలో పోలీసులు తండ్రిని ఓ కంట కనిపెడుతుండగా ఆ సమయంలోనే కిడ్నాపర్ల ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే దీక్షిత్ ను అపహరించి ఆ తర్వాత నిందితులు పిల్లాడిని పెట్రోల్ పోసి హత్య చేశారు.కిడ్నప్ లో పాల్గొన్న దీక్షిత్ మేనమామ మనోజ్ రెడ్డి, మందసాగర్ అనే వ్యక్తితో కలిసి కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై ఆ బాలుడిని పెట్రోల్ పోసి హత్య చేశారు.

అయితే ఈ విషయంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడి మేనమామ మనోజ్ రెడ్డి, మంద సాగర్ ను పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపేసినట్లు గా సమాచారం తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube