America Listeria: అమెరికాను వణికిస్తోన్న లిస్టెరియా ఇన్‌ఫెక్షన్, 6 రాష్ట్రాల్లో తీవ్రత

కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికాను మరో వ్యాధి వణికిస్తోంది.

కలుషితమైన మాంసం తీసుకోవడం వల్లే వచ్చే ‘‘లిస్టెరియా’’ ఇన్ఫెక్షన్ అక్కడ వెలుగులోకి వచ్చింది.

దాదాపు 6 రాష్ట్రాల్లో ఇది ప్రబలినట్లుగా మీడియా నివేదికలు చెబుతున్నాయి.దీనికారణంగా తీవ్రమైన జ్వరం, అతిసారం, కండరాల నొప్పులు కలుగుతాయి.

గర్బిణీలు, 65 ఏళ్లకు పైబడ్డ వారికి , రోగ నిరోధక శక్తి బలహీనంగా వున్న వారికి ‘‘లిస్టెరియా’’ వల్ల తీవ్ర అనారోగ్యం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.గత వారం వరకు న్యూయార్క్, మేరీలాండ్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, కాలిఫోర్నియా, మసాచుసెట్స్ రాష్ట్రాల్లో 16 లిస్టెరియా కేసులు నమోదైనట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ తెలిపింది.

దీని కారణంగా ఒక గర్భవతి తన బిడ్డను కోల్పోగా.ఇన్ఫెక్షన్ బారినపడిన ఓ వ్యక్తి మరణించినట్లుగా కథనాలు వచ్చాయి.

Advertisement

మొత్తంగా లిస్టెరియా కారణంగా 13 మంది ఆసుపత్రి పాలయ్యారు.వైద్య సంరక్షణ లేకుండానే లిస్టెరియా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకునే అవకాశం వున్నందున దీనిని జనం లైట్ తీసుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే అధికారికంగా వెలుగులోకి వచ్చిన దాని కంటే రోగుల సంఖ్య ఇంకా ఎక్కువే వుండొచ్చని సీడీసీ అభిప్రాయపడుతోంది.రాష్ట్రాల్లోని పబ్లిక్ హెల్త్ అండ్ రెగ్యులేటరీ అధికారులు, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ , యూఎస్ ఫుండ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు .లిస్టెరియా సామూహిక వ్యాప్తిని అరికట్టేందుకు శ్రమిస్తున్నారు.ఈ మేరకు డేటాను సేకరించే పనిలో పడ్డారు.

డెలి కౌంటర్ల నుంచి చీజ్ లేదా మాంసాన్ని తీసుకున్నట్లు ఎక్కువమంది రోగులు చెప్పారని నివేదిక చెబుతోంది.కొన్నిరోజుల్లోనే నయమయ్యే అవకాశం వున్నప్పటికీ హై రిస్క్ కేటగిరీ వారిలో లిస్టెరియా ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే గర్భం దాల్చిన మహిళలపై ప్రభావం ఎక్కువ చూపుతుందని.

పుట్టిన శిశువు కూడా చనిపోయే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు