పూరి జగన్నాథ్( Puri Jagannadh ) తెరకెక్కించిన లైగర్ సినిమా( Liger ) అటు విజయ్ దేవరకొండకు ఇటు పూరీకి సైతం పీడకలగా మిగిలిపోయింది.ఈ సినిమా బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకుని అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని అనుకున్నారు.
కానీ సినిమా విడుదలైన తర్వాత ఉసూరుమని అనిపించింది.ఈ సినిమాకి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) చాలా కష్టపడ్డాడు.
అయినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.తన విజయం కోసం చాలా రోజులుగా పూరి జగన్నాథ్ సైతం ఎదురు చూస్తున్నాడు.
కానీ ఆ విజయం అందనీ ద్రాక్ష గానే మిగిలిపోయింది.లైగర్ సినిమా పరాజయం నుంచి విజయ్ దేవరకొండ త్వరగ నే కోలుకున్నాడు.
ఖుషి సినిమా అతనికి కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది.ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
అందుకే గతం తాలూకు గాయాలు త్వరగానే మార్చుకోగలిగాడు.

ఎటోచ్చి ఇప్పుడు పూరీ జగన్నాథ్ మాత్రమే పూర్తిగా సతమతమవుతున్నాడు.ఈ సినిమా కోసం దాదాపు లైగర్ తర్వాత రెండేళ్ల విరామం తీసుకుని మరీ చేస్తున్నాడు.ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా 2019లో రాగా దాదాపు 5 ఏళ్ల విరామంతో డబల్ ఇస్మార్ట్( Double Ismart ) రాబోతోంది.ఈ సినిమాలో సైతం మునపటి జోడి పోతీనేని రామ్( Pothineni Ram ) మరియు పూరి కాంబినేషన్ ఉండబోతోంది.
పూరి జగన్నాథ్ కి మాత్రమే కాదు రామ్ కి కూడా ఇది కత్తి మీద సవాల్ లాంటి చిత్రమే.ఎందుకంటే స్కంద సినిమా( Skanda Movie ) పరాజయం అతడికి తీవ్ర నిరాశను మిగిల్చింది.
శ్రీలీల లాంటి హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్ సినిమాకి చాలా కసరత్తు చేస్తున్నాడు.ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఐదేళ్ల నుంచి అతడికి కూడా విజయం లేదు.ఆ చిత్రం తర్వాత రెడ్, ది వారియర్, స్కంద సినిమాల్లో నటించినప్పటికీ ఈ మూడు కూడా వరుస డిజాస్టర్ ఫలితాలను ఇచ్చాయి.
దాంతో ఒక విజయం పడకపోతుందా అని రాం పోతినేని సైతం ఎదురు చూస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఆ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో కూడా రామ్ నటిస్తున్నాడు.
మరి డబల్ ఇస్మార్ట్ ఏ మాత్రం డోస్ పెంచి అటు పూరీకి ఇటు రామ్ కి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.