ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంటే క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో డేవిడ్ వార్నర్ బాగా పాపులర్.
టాలీవుడ్ హీరోల సినిమాల హిట్ ట్రాక్ లను టిక్ టాక్ లో ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేస్తూ టిక్ టాక్ లు చేస్తున్నాడు.డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో చేసిన బుట్టబొమ్మ ఎంత పాపులర్ అయిందో మనం చూసాం.
ఇండియా- ఆస్ట్రేలియా సిరీస్ మ్యాచ్ లో ప్రేక్షకులు బుట్టబొమ్మ అని అరవడం, వెంటనే డేవిడ్ వార్నర్ కూడా గ్రౌండ్ లోనే చిన్న సైజు స్టెప్పు వేయడం లాంటివి ఎంతగా ఫేమస్ అయ్యాయో మనం చూసాం.మరల మహర్షిలోని మహేష్ బాబు పాటను కూడా తన ఫేస్ ను మార్ఫింగ్ చేసి కామెడీ వీడియోను విడుదల చేసాడు.
ఇప్పుడు మరల మరో వీడియోతో ఇంస్టాగ్రామ్ లో హల్ చల్ చేసాడు.ఇప్పుడు ఎవరిదో కాదు ఏకంగా మెగాస్టార్ ఆచార్య టీజర్ ను తన స్టైల్లో వీడియో విడుదల చేసాడు.
చిరు ఫేస్ ని మార్ఫింగ్ చేసి కామెడీగా చేసి విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు హీరోల పాటలను ఇమిటేట్ చేస్తుండడంతో డేవిడ్ వార్నర్ తెలుగువాడయ్యాడు.మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం వీడియో చూడండి.