మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు చిరు.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్న చిరు, ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే ఈ సినిమా కథలో మార్పుల గురించి చాలా వార్తలు రాగా, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు వినిపించినా, చిత్ర యూనిట్ మాత్రం స్టార్ బ్యూటీ నయనతారను తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
చిరు లాంటి స్టార్ హీరో పక్కన అంతే ప్రాముఖ్యత కలిగిన హీరోయిన్‌గా నయనతార అయితే చాలా బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.అందుకే ఈ సినిమాలో అమ్మడిని తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.
అయితే మలయాళ లూసిఫర్‌లో హీరోయిన్ లేదు.కానీ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను సృష్టించి ఆ పాత్ర కోసం నయనతారను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
గతంలో చిరుతో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన నయన్, మరోసారి చిరుతో కలిసి నటిస్తుందో లేదో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్.