తండ్రి వివాహేతర సంబంధం బయటపడడంతో కూతురు ఏం చేసిందంటే..?

మహారాష్ట్ర లోని( Maharashtra ) నాగ్ పూర్ లోని భివాపూర్ లో దిలీప్ రాజేశ్వర్ (66)( Dileep Rajeshwar ) అనే వ్యక్తి నివాసం ఉంటూ, నాగ్ పూర్-నాగ్ భీద్ హైవేపై పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు.

ఇతనికి ఇద్దరు కుమార్తెలు సంతానం.

పెద్ద కుమార్తె మహూర్తలె కు వివాహం కాగా భార్య, కూతురితో కలిసి ఉంటున్నాడు.ఇంతవరకు ఈ కుటుంబం సంతోషంగానే ఉంది.

అయితే స్థానికంగా ఉండే ఓ మహిళతో దిలీప్ రాజేశ్వర్ వివాహేతర సంబంధం( Illegal Relationship ) కొనసాగిస్తున్నాడనే విషయం బయటపడింది.దీంతో దిలీప్ రాజేశ్వర్ కు ఇతని భార్యకు మధ్య గొడవలు జరగవటం మొదలయ్యాయి.

భార్య ఎన్నిసార్లు చెప్పినా దిలీప్ రాజేశ్వర్ తన ప్రవర్తనను మార్చుకోకుండా తిరిగి భార్య, ఇద్దరు కూతుర్లను వేధించడం మొదలుపెట్టాడు.అంతేకాకుండా దిలీప్ తన ప్రియురాలి పేరు పై కూడా ఆస్తిలో కొంత భాగం రాయాలని ప్రయత్నంలో ఉన్నాడు.ఈ క్రమంలోనే దిలీప్ రాజేశ్వర్ పెద్ద కూతురు తన ఇంటికి టైల్స్ వేయడానికి వచ్చిన వ్యక్తితో పరిచయం పెంచుకొని, తన తండ్రి ను హత్య చేసేందుకు రూ.5 లక్షల సుపారీ ఆఫర్ చేసింది.టైల్స్ వేయడానికి వచ్చిన వారు సుపారీ తీసుకొని ఈనెల 17న మాస్క్ ధరించి దిలీప్ రాజేశ్వర్ పెట్రోల్ బంకు లోని ఆఫీస్ లోపలికి వెళ్లారు.

Advertisement

ఆఫీసులోకి వస్తూనే దిలీప్ పై ఏకంగా 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచారు.క్షణాల్లో దిలీప్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.దిలీప్ దగ్గర ఉండే 1.34 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు అక్కడికి చేరుకొని మృతుదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవి ఫుటేజ్ లను పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించారు.కేవలం కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకొని వారి కాల్ డేటా పరిశీలించగా.

మృతుడి పెద్ద కుమార్తెకు చాలా సార్లు ఫోన్ చేసినట్లు బయటపడింది.

వెంటనే పోలీసులు మృతుడి పెద్ద కుమార్తెను అదుపులోకి తీసుకొని విచారించగా తానే తన తండ్రిని హత్య చేయించినట్లు అంగీకరించింది.తన తండ్రి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనతో పాటు తన తల్లిని, తన చెల్లిని ఇబ్బందులకు గురి చేయడమే కాక ఆస్తి లో కొంత భాగం ఆ మహిళ పేరుపై రాసే ప్రయత్నంలో ఉండడంతో ఈ దారుణం చేయించానని పోలీసులకు తెలిపింది.

బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ ప్రింట్ ప్రదర్శన.. చరణ్ కు టైం అస్సలు బాలేదా?
Advertisement

తాజా వార్తలు