యూఎస్ లో 'దసరా' ఫస్ట్ డే మాసివ్ ఓపెనింగ్స్.. ఎంత రాబట్టిందంటే?

టైర్ 2 హీరోల్లో నాచురల్ స్టార్ నాని ( Nani ) ఒకరు.ఈయన గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక బాధ పడుతున్నారు.

 Dasara Sets All Time Record In Usa Box Office, Dasara, Nani, Keerthy Suresh, San-TeluguStop.com

ఈ మధ్యకాలంలో నాని చేసిన అన్ని సినిమాలు రొటీన్ గా ఉన్నాయని ప్రేక్షకులు తీర్పు చెప్పి వాటిని ప్లాప్ చేస్తూ వస్తున్నారు.ఒకటి అరా హిట్ అయినా నాని కెరీర్ కు అది సరిపోవడం లేదు.

మరి ఈ తరుణం లోనే నాని తీసుకున్న ఒక్క డెసిషన్ ఇప్పుడు ఈయనను మరో మెట్టు ఎక్కేలా చేసాయి.

నాని రొటీన్ కథలకు భిన్నంగా మాస్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు చేసిన సినిమా దసరా.

ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నిన్న శ్రీరామనవమి రోజున రిలీజ్ అయ్యింది.నాని హీరోగా కీర్తి సురేష్ ( Keerthy Suresh ) హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”దసరా”( Dasara ).రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కించారు.

ధరణి పాత్రలో నాని తనలోని మాస్ నటనను బయటకు తీసి ఆడియెన్స్ కు థ్రిల్ ఇచ్చాడు.క్లాస్ హీరో నుండి ఇలాంటి నటన ఎక్స్పెక్ట్ చేయని ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.దసరా సినిమాకు అనుకున్న విధంగానే యూఎస్ లో కూడా మంచి అంచనాలు పెరిగాయి.

అక్కడ కూడా ముందు నుండి పెరిగిన అంచనాల మధ్య సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమా జస్ట్ ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చేయగా ఇప్పుడు ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందో బయటకు వచ్చింది.యూఎస్ డిస్టిబ్యూటర్స్ అందించిన సమాచారంతో ఈ సినిమా అక్కడ 8 లక్షల 50 వేల డాలర్స్ ను మొదటి రోజు రాబట్టినట్టు అనౌన్స్ చేసారు.ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి.

ఓపెనింగ్స్ ఈ రేంజ్ లో రావడంతో టీమ్ అందరి ఆనందానికి అవధులు లేవు.ఇక అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మరో వారం పదిరోజులు దున్నేయడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube