నైజాంలో 'దసరా' డే 1 వసూళ్లు ఇన్ని కోట్లా.. ధరణిగాడి ర్యాంపేజ్ నెక్స్ట్ లెవల్ అంతే!

నాచురల్ స్టార్ నాని ( Nani ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దసరా”( Dasara ).ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి ఎంటర్ అయ్యి మాస్ కే చుక్కలు చూపించాడు.

 Dasara Nizam Day 1 Box Office Collections, Dasara, Dasara Nizam Collections, Niz-TeluguStop.com

అసలు క్లాస్ హీరో అయినటువంటి నాని మాస్ సినిమాను ఎలా బ్యాలెన్స్ చేయగలడు అని సినిమా రిలీజ్ అయ్యే వరకు అందరిలో ఒక ప్రశ్న ఉండేది.

కానీ దసరా సినిమాలో నాని యాక్టింగ్ చూసిన తర్వాత ఎవ్వరూ తన నటన గురించి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు.

రొటీన్ కు భిన్నంగా నాని దసరా సినిమాలో ధరణి రోల్ చేసి తాను ఇలాంటి పాత్రను కూడా చేయగలను అని నిరూపించాడు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ ( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది.వరల్డ్ వైడ్ గా మార్చి 30న రిలీజ్ అవ్వగా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

కాగా ఈ సినిమా నైజాం లో ( Dasara Nizam Collections ) మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

యూఎస్ లో ఈ సినిమాతో నాని ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్ సాధించగా.ఇప్పుడు నైజాం ఏరియాలో కూడా నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు.అంతేకాదు టైర్ 2 హీరోల్లో నాని సంచలన రికార్డ్ క్రియేట్ చేసాడు.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు నైజాంలో 6.77 కోట్ల షేర్ ను రాబట్టిందట.మొత్తానికి ధరణిగాడి ర్యాంపేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.చూడాలి ముందు ముందు ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube