మహానటి ఫేం కీర్తి సురేష్( keerthy suresh ) కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.మొన్నటి వరకు దసరా సినిమా విడుదల అయ్యే వరకు కొత్త సినిమాలు కమిట్ అవ్వను అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా దసరా సినిమా విడుదల అయింది.చిత్రంలో కీర్తి సురేష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా దసరా సినిమా లో కీర్తి సురేష్ నటన ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.మహానటి తర్వాత ఆ స్థాయి నటన కనబర్చింది అంటూ ఆమెకు సంబంధించిన వారు మరియు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రివ్యూవర్స్ కూడా సినిమాలో కీర్తి సురేష్ నటన సూపర్ అంటూ కితాబిచ్చారు.దసరా( Dasara ) సినిమా తర్వాత ఒక్కసారిగా కీర్తి సురేష్ కు ఆఫర్లు వెళ్లువెత్తుతున్నాయి.ఇటీవల వచ్చిన రెండు ఆఫర్లకు కీర్తి సురేష్ నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.దసరా ప్రమోషన్ లో హడావుడిగా ఉన్నాను.
కాస్త సమయం కావాలంటూ వారికి ఈమె చెప్పిందట.దాంతో కీర్తి సురేష్ ఇంకాస్త ఎక్కువ సమయం బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.గత కొన్ని నెలలుగా కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పలేదు.దసరా తర్వాత అంటూ చెబుతూ వచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు ఎందుకు కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు అంటూ కొందరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.
వెంటనే కీర్తి సురేష్ కొత్త సినిమాలు చేయాల్సిందిగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆకట్టుకునే రూపంతో పాటు అన్ని విధాలుగా ఈ అమ్మడి యొక్క అందం ఆకట్టుకుంటూ ఉంటుంది.
కనుక తమిళ మరియు తెలుగు సినిమాల్లో( Tollywood ) ఈమె నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కీర్తి సురేష్ మరో నెల రోజుల తర్వాత అయినా కొత్త సినిమాలకు ఓకే చెబుతుందా అనేది చూడాలి.
ఫ్యాన్స్ ఈమె కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.