రోజు తెరపై చూసే నటీనటుల నిజ జీవితాల విశేషాల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా ఉంటుంది.అయితే ఈ విషయాలను యాక్టర్స్ కొన్ని కార్యక్రమాలు, ఇంటర్వ్యూలలో బయటపెడుతుంటారు.
ఆ విశేషాలు తెలుసుకున్నప్పుడు ప్రేక్షకులకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.ప్రముఖ యాక్టర్ చంద్రమోహన్( Chandramohan ) కూడా ఒకానొక సందర్భంలో తనకు ఎదురైన చిత్రమైన ఘటన గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
కొంతకాలం క్రితం చంద్రమోహన్ ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ( Comedian Ali ) ఫ్యామిలీ ఫంక్షన్‌కి అతిథిగా వచ్చాడు.ఆ కార్యక్రమం అలీ కూతురి కోసం చేస్తున్నారు.
ఆ కూతురి ఫంక్షన్ లో ఆ కూతురి గురించే చంద్రమోహన్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకున్నారు.
చంద్రమోహన్‌కు పిల్లలను దగ్గరకు పిలిచి వారి చెవి మీద వేలుతో గట్టిగా కొట్టే అలవాటు ఉంది.
ఆయన అలా కొట్టడం వల్ల పిల్లలు నొప్పితో ఏడ్చేవారు.అది చూసి చంద్రమోహన్ బాగా నవ్వుతుండేవాడు.
కమెడియన్ అలీ చెవులపై కూడా చంద్రమోహన్ అలాగే కొట్టి ఏడిపించేవాడు.అయితే ఒకరోజు కమెడియన్ అలీ చంద్రమోహన్ కలిసి ఒక మూవీ షూట్ చేయడానికి ఒక పార్కుకు వెళ్లారు.
ఆ షూటింగ్ చూసేందుకు తాను కూడా వస్తానంటే కూతురిని కూడా తీసుకొచ్చాడు అలీ.అప్పటికి అలీ కూతురు వయసు ఆరేళ్ల దాకా ఉంటుంది.కూతురితో పాటు తన కజిన్ కొడుకుని కూడా అలీ వెంటబెట్టుకుని వచ్చాడు.ఆ పిల్లోడికి 10 సంవత్సరాల వయసు దాకా ఉంటుంది.
చంద్రమోహన్ ఆ బాలుడిని చూసి దగ్గరికి పిలిచాడు.తర్వాత అతడు చెవి పై గట్టిగా వేలుతో కొట్టి అతడిని ఏడిపించాడు.
ఇది చూసిన అలీ కూతురికి బాగా కోపం వచ్చింది.పక్కనే ఉన్న ఒక పెద్ద రాయి తీసుకొని చంద్రమోహన్ వైపు చూస్తూ “ఏది మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి కొట్టు” అని ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది.
ఆ బాలిక తెలియక బండరాయి తన వైపు విసురుతుందేమో అని చంద్రమోహన్ చాలా భయపడిపోయాడట.అంతేకాదు అలీ కూతురు చంద్రమోహన్ ని పార్క్ అంతా పరిగెత్తించిందట.చివరికి దీని గురించి తెలుసుకొని అలీ తన కూతురిని శాంతింప చేశాడట.ఈ సంఘటన గురించి తలుచుకుంటే తనకు ఎప్పుడూ వణుకు పుట్టేదని చంద్రమోహన్ చెప్పుకొచ్చాడు.