ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది.నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
ఈ తొమ్మిది రోజుల సమయంలో మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది.మొదటి రోజైన ఈ రోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.
ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇస్తారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇవ్వనున్నారు.
అలాగే ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని భక్తులకు కొండపైకి అనుమతి ఉండదు.వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరించిన దేవస్థానం.పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించింది.
ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు.
వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.
ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పించనున్నారు.