యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన 30 దళిత కుటుంబాలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేస్తుందని,అర్హులైన నిరుపేద దళితులకు దళిత బంధు ఇవ్వకుండా పైరవీలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తుండ్రని మండిపడ్డారు.
దళితులకు బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదని,
అందుకనే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దళితులకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని,రాబోయే కాలంలో దళితులకు అన్ని రకాలుగా ముందుండి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుందని,కార్యకర్తలు అధైర్య పడకుండా మూడు నెలల కష్టపడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో చిందం ప్రకాష్,సుదగాని రామచంద్ర గౌడ్,మబ్బు ఉమేష్,యాదగిరి, నరసింహ,రవి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.







