Daksha Nagarkar: నాగ చైతన్య ముద్దు పెట్టాక క్షమించమని అడిగేవాడు : దక్ష నాగర్కర్

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీ లో పని చేసిన కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేని సినిమాలు చేసిన హీరోయిన్స్ లలో దక్ష నాగర్కర్( Daksha Nagarkar ) కూడా ఒకరు.ఈమె 2014 నుంచి సినిమాలు చేస్తున్న సరైన గుర్తింపుకు మాత్రం నోచుకోలేదు.

 Daksha Nagarkar About Naga Chaitanya-TeluguStop.com

ప్రస్తుతం రవి తేజ హీరో గా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అయినా రావణాసుర చిత్రంలో( Ravanasura ) కూడా నటిస్తుంది.ఈ చిత్రం తో అయినా ఆమె దశ తిరుగుతుంది అని బోలెడు ఆశలు పెట్టుకుంది దక్ష.2007 లో భూగత కన్నడ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది దక్ష.ఆ తర్వాత మాలినడ మెలిగే అనే మరో కన్నడ సినిమాలో నటించింది.

Telugu Bangarraju, Daksha Nagarkar, Naga Chaitanya, Nagachaitanya, Ravanasura, R

ఆ తర్వాత హీరోయిన్ గ మారి కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం అయినా దక్ష మొదట ఏకే రావు పీకే రావు అనే సినిమాలో నటించింది.ఆ తర్వాత హోరాహోరీ చిత్రంలో నటించగా ఆమెకు పెద్దగా ఈ చిత్రాలు పేరును తీసుకురాలేదు.అయితే ఆ తర్వాత హుషారు అనే సినిమాలో కనిపించిన దక్షను జనాలు గుర్తు పట్టడం మొదలు పెట్టారు.ఇక జాంబీ రెడ్డి మరియు బంగార్రాజు సినిమాలు మాత్రం ఆమె కెరీర్ లో నే మంచి చిత్రాలుగా చెప్పుకోవచ్చు.

ఈ చిత్రాల ద్వారా వచ్చిన గుర్తింపు వల్లనే ఆమెకు రావణాసుర చిత్రంలో అవకాశం లభించింది.

Telugu Bangarraju, Daksha Nagarkar, Naga Chaitanya, Nagachaitanya, Ravanasura, R

ఇక అసలు విషయం లోకి వెళ్తే ఇటీవలే రావణాసుర ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.దాంట్లో భాగంగా దక్ష కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వూస్ ఇస్తుంది.ఆ క్రమం లో బంగార్రాజు సినిమాలో( Bangarraju ) తనకు జరిగిన ఒక సంఘటన అభిమానులతో పంచుకుంది.

బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కు ( Naga Chaitanya ) తన పక్కన నటించడం చాల అన్ కంఫర్ట్ గా అనిపించిందట.ఏమైనా హగ్ సీన్స్ మరియు ముద్దు సీన్ ఉన్నప్పుడు దర్శకుడు చెప్పింది చేసేసి ఆ తర్వాత దక్షకు అనేక మార్లు సారీ చెప్పేవాడట.

ఆలా సినిమా మొత్తంలో చాల సార్లు నాగ చైతన్య దక్షకు క్షమాపణ చెప్పాడట.ఈ విషయం తెలిసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరవేస్తున్నారు.అది మా అన్న అంటే.ఆడపిల్లల విషయంలో ఎంతో పద్ధతి గా ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube