Daksha Nagarkar: నాగ చైతన్య ముద్దు పెట్టాక క్షమించమని అడిగేవాడు : దక్ష నాగర్కర్

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీ లో పని చేసిన కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేని సినిమాలు చేసిన హీరోయిన్స్ లలో దక్ష నాగర్కర్( Daksha Nagarkar ) కూడా ఒకరు.

ఈమె 2014 నుంచి సినిమాలు చేస్తున్న సరైన గుర్తింపుకు మాత్రం నోచుకోలేదు.ప్రస్తుతం రవి తేజ హీరో గా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అయినా రావణాసుర చిత్రంలో( Ravanasura ) కూడా నటిస్తుంది.

ఈ చిత్రం తో అయినా ఆమె దశ తిరుగుతుంది అని బోలెడు ఆశలు పెట్టుకుంది దక్ష.

2007 లో భూగత కన్నడ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది దక్ష.

ఆ తర్వాత మాలినడ మెలిగే అనే మరో కన్నడ సినిమాలో నటించింది. """/" / ఆ తర్వాత హీరోయిన్ గ మారి కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం అయినా దక్ష మొదట ఏకే రావు పీకే రావు అనే సినిమాలో నటించింది.

ఆ తర్వాత హోరాహోరీ చిత్రంలో నటించగా ఆమెకు పెద్దగా ఈ చిత్రాలు పేరును తీసుకురాలేదు.

అయితే ఆ తర్వాత హుషారు అనే సినిమాలో కనిపించిన దక్షను జనాలు గుర్తు పట్టడం మొదలు పెట్టారు.

ఇక జాంబీ రెడ్డి మరియు బంగార్రాజు సినిమాలు మాత్రం ఆమె కెరీర్ లో నే మంచి చిత్రాలుగా చెప్పుకోవచ్చు.

ఈ చిత్రాల ద్వారా వచ్చిన గుర్తింపు వల్లనే ఆమెకు రావణాసుర చిత్రంలో అవకాశం లభించింది.

"""/" / ఇక అసలు విషయం లోకి వెళ్తే ఇటీవలే రావణాసుర ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

దాంట్లో భాగంగా దక్ష కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వూస్ ఇస్తుంది.ఆ క్రమం లో బంగార్రాజు సినిమాలో( Bangarraju ) తనకు జరిగిన ఒక సంఘటన అభిమానులతో పంచుకుంది.

బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కు ( Naga Chaitanya ) తన పక్కన నటించడం చాల అన్ కంఫర్ట్ గా అనిపించిందట.

ఏమైనా హగ్ సీన్స్ మరియు ముద్దు సీన్ ఉన్నప్పుడు దర్శకుడు చెప్పింది చేసేసి ఆ తర్వాత దక్షకు అనేక మార్లు సారీ చెప్పేవాడట.

ఆలా సినిమా మొత్తంలో చాల సార్లు నాగ చైతన్య దక్షకు క్షమాపణ చెప్పాడట.

ఈ విషయం తెలిసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరవేస్తున్నారు.అది మా అన్న అంటే.

ఆడపిల్లల విషయంలో ఎంతో పద్ధతి గా ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

తెల్ల జుట్టుకు ఇంట్లోనే న్యాచురల్ గా రంగేయండిలా!