ఇటీవలే కాలంలో దారి దోపిడీలు క్రమంగా పెరుగుతూ అందరినీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.పాత రోజుల్లో అయితే తాళం వేసిన ఇళ్లల్లో దోపిడీలు జరిగేవి.
కానీ ప్రస్తుత కాలంలో చేతుల్లో ఉండే సొమ్మునే దోపిడీ చేసి క్షణాల్లో పారిపోతున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఘటన చిత్తూరు జిల్లాలోని గుడిపాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే చిత్తూరు( Chittoor ) జిల్లాలోని వసంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉషా దంపతులు గుడిపాలలో జ్యూవెలరీ షాప్ నడుపుతున్నారు.వీరు ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి బంగారు ఆభరణాలను( Gold jewelry ) షాపుకు తీసుకువెళ్లి అమ్మడం.
రాత్రి మిగిలిన బంగారు ఆభరణాలను ఇంటికి తీసుకురావడం అనేది వీళ్ళ దినచర్య.ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 7:30 గంటలకు షాపులో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని గుడిపాల నుండి వసంతాపురం లోని తమ ఇంటికి వచ్చారు.శ్రీనివాసులు ఇంటి వెనుక కారు ను పార్క్ చేస్తున్న సమయంలో.ఉషా చేతిలో ఉండే బంగారు ఆభరణాల బ్యాగును ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి.
ఉషా పై దాడి చేసి బ్యాగు తీసుకుని పరారయ్యారు.

ఇదంతా గమనించిన భర్త, చుట్టుపక్కల ఉండే స్థానికులు ఉషా వద్దకు వెళ్లే లోపే దుండగులు బైక్ పై పరారయ్యారు.పోలీసులకు( Police ) సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలాన్ని చేరుకుని విచారించగా నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో గల ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేశారని స్థానికులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ప్రాంతంలో ఉండే సీసీ కెమెరాల ఆధారంగా వీలైనంత తొందరగా నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
నిందితులను పట్టుకోవడం కోసం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు తమిళనాడు సరిహద్దులో వాహన తనిఖీల నిర్వహణ ముమ్మరం చేశారు.







