తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి7, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.15

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.10.00 ల10.20

Advertisement

దుర్ముహూర్తం: మ.11.36 ల12.34

మేషం:

ఈరోజు మీకు ఇతరులతో కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి పేరు దక్కుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ జీవితభాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

స్థల నిర్ణయాల గురించి తోబుట్టువులతో మాట్లాడుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నా.ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవగాహన ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కొన్ని ప్రయాణాల వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.చాలా రోజుల నుండి తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.అనవసరమైన విషయాల గురించి తొందరపడకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

తుల:

ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

ఈరోజు జాగ్రత్తలు అవసరం.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల పనులు ఆగిపోతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీ స్నేహితులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడపాలి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల నిరుత్సాహ చెందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

సమయాన్ని వృధా చేయకూడదు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.గతంలో మీ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.

తాజా వార్తలు