దగ్గుబాటి ఫ్యామిలీలో వరుసగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.ఇటీవల కాలంలో విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) రెండవ కుమార్తె హయవాహిని నిశ్చితార్థం విజయవాడలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.
ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా హాజరై సందడి చేశారు.ఇక నేడు సురేష్ బాబు( Suresh Babu ) రెండో కుమారుడు అభిరామ్( Abhi Ram ) వివాహం కూడా జరగబోతుందని తెలుస్తుంది.
డిసెంబర్ 6వ తేదీ రాత్రి 8:50 నిమిషాలకు అభిరామ్ ప్రత్యూషల ( Prathyusha ) వివాహం జరగబోతుందని తెలుస్తుంది.వీరు కూడా డెస్టినేషన్ వివాహం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కూడా శ్రీలంక (Sri Lanka ) చేరుకున్నారు.

ఇలా రావణ రాజ్యంలో అభిరాముడు పెళ్లి వేడుకలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దగ్గుబాటి కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.ప్రస్తుతం వీరంతా శ్రీలంక చేరుకున్నారు.సురేష్ బాబు ఫ్యామిలీ ( Suresh Babu )తో పాటు వెంకటేష్ ఫ్యామిలీ అలాగే నాగచైతన్య వంటి వారందరూ కూడా ఎయిర్ పోర్ట్ లో కనిపించి సందడి చేశారు.ఇక నేడు ఉదయం హల్దీ వేడుకలు జరగబోతున్నాయని అలాగే రాత్రి 8 గంటల 50 నిమిషాలకు వీరిద్దరి వివాహ వేడుకలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్నాయని తెలుస్తుంది.

మరి కాసేపట్లో అభిరామ్ ప్రత్యూషల వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.అభిరామ్ శ్రీలంకలో పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాదులో వీరి వివాహ రిసెప్షన్ జరగబోతుందని ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.అభిరామ్ హీరోగా అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సినిమాల పనులలో బిజీగా ఉన్నారు.అయితే తన కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈయన పెళ్లి చేసుకోబోతున్నారని, అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తమ సమీప బంధువుల అమ్మాయని తెలుస్తుంది.







